నర్సీపట్నంను జిల్లా కేంద్రం చేయాలంటూ జనసేన ర్యాలీ

జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రాజన్న వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో నర్సీపట్నం సిబిఎన్ కాంపౌండ్ నుండి పెద్ద బొడ్డేపల్లి సెంటర్ వరకు నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలంటూ నినాదాలు చేస్తూ నర్సీపట్నం టౌన్ లో నాలుగు మండల అధ్యక్షులు సమక్షంలో బైక్ ర్యాలీ చేసి మెయిన్ రోడ్డు పై మానవహారంగా ఏర్పడి పెద్ద ఎత్తున నర్సీపట్నంను జిల్లా కేంద్రం చేయాలంటూ జనసేన తరపున డిమాండ్ చేస్తున్నాం అని జనసేన నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గమునకు ఒక జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రక్రియను మేము జనసేన తరపున స్వాగతిస్తున్నాం కానీ ఆ పార్లమెంటు పరిధిలో అనకాపల్లి ఇప్పటికే విశాఖ పరిధిలో ఉన్నందున నర్సీపట్నంలో జిల్లా కేంద్రంగా గుర్తించమని ముఖ్యముగా బ్రిటిష్ కాలం నుండి నర్సీపట్నం మేజర్ రెవెన్యూ డివిజన్ గా ఉన్నది మరియు ఏజెన్సీ ముఖద్వారముగా అభివృద్ధికి ఇంకా ఆస్కారం ఉన్నది విశాఖ జిల్లా తరువాత ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణము నర్సీపట్నం ఇచ్చట ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ప్రభుత్వ బిల్డింగులలోనే ఉన్నది ఎక్కడా ప్రైవేటు స్థలంలో లేవు జిల్లా ఆఫీసులో పెట్టుకొనుటకు విశాలమైన గవర్నమెంట్ ప్రాంగణాలు ఉన్నాయి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో నర్సీపట్నం ప్రాంతం అన్ని మండలాలకు మధ్యస్తంగా ఉంటుంది నర్సీపట్నం ప్రాంతం ఒక చరిత్ర కలిగిన ప్రదేశము అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఈ ప్రాంత ప్రజలు మనోభావాలను గౌరవిస్తూ నర్సీపట్నం జిల్లా కేంద్రంగా చేస్తూ అల్లూరి సీతారామరాజు నర్సీపట్నం జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టడం జరిగిందని జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం కలెక్టర్ కి నర్సీపట్నం జిల్లా కేంద్రంగా చేయాలంటూ వినతిపత్రం విశాఖపట్నంలో జనసేన నాయకులు సమక్షంలో అందజేస్తాము అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, నర్సీపట్నం టౌన్ నాయకులు పంచద హరినాథ్, గుండు గోగుల శ్రీనివాస్, ఎర్ర ఈశ్వరరావు, గూడుపు తాతబాబు, మల్లాడి శ్రీను, బైన మురళి, మంగళ భాస్కర్, కొత్తకోట రామ్ శేఖర్, వెలగ అప్పలనాయుడు, గుర్రాల పవన్, అరుణ్ కుమార్, రాజు, అశోక్, వాసం వెంకటేష్, వడ్డే నవీన్ తదితరులు పాల్గొన్నారు.