శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ మంగళవారం శుభారంభం అయింది. తుమ్మికాపల్లిలోని కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే లలిత కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా చొక్కాకుల సూర్యనారాయణ, వైస్ చైర్మన్‌గా ఆదిబాబు పదవులు స్వీకరించారు. కమిటీలో జనసేన పార్టీకి రెండు స్థానాలు లభించగా, సీనియర్ జనసైనికుడు మల్లువలస శ్రీను, వీర మహిళ ఇర్ర వెంకట లక్ష్మికి అవకాశం దక్కింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ వేడుకలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, పర్యాటక సంస్థ డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment