బొలిశెట్టితో జనసేన రాక్స్ ఆత్మీయ సమ్మేళనం

హైదరాబాద్: హైదరాబాద్ ఉద్యోగస్తులు, ఉన్నత విద్యావంతులు జనసేన పార్టీకి అండగా నిలవడం జనసేన పార్టీ తోలి విజయమని ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంటరీ ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన జనసేన రాక్స్ ఆత్మీయ సమ్మేళనం తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వరుడు సైతం ఇక్కడి ప్రభుత్వ అరాచక పాలన నుండి విముక్తి కోరుకుంటున్నారన్నారు. రాక్స్ ప్రతినిధులు మాట్లాడుతూ జనసేన అధ్యక్షుని ఆశయాలు నచ్చి ఆయన చేసే సేవాకార్యక్రమాలలో భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో జనసేనరాక్స్ ఏర్పడిందన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో తాడేపల్లిగూడెం, కాకినాడ రూరల్, భీమిలి నియోజకవర్గాలను ఎంచుకొని అక్కడి అభ్యర్థులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తమన్నారు. ఈ కార్యక్రమంలో జి శివ, వి ఎస్ ఎన్ మూర్తి, వై వీ రాంబాబు, ఏ సతీష్ బాబు, జి విశ్వనాథ్, పి వెంకటేశ్వరరావు, పీ వీ సత్యనారాయణ, ఈ బాబురావు, సిహెచ్ వి రాము, జి రామకృష్ణారావు, నానిబాబు, బి ఈశ్వరరావు, రత్న కూమారి మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.