అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శుక్రవారం జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు ఒకచోట సమావేశమై గంగరాజు చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, జనసేన తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ, ఈరోజు ఉదయం నుండీ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా తన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, నియోజకవర్గ సీనియర్ నాయకులు వి హెచ్ రాయుడు, గాజులపల్లి రమేష్, నవీన్ కుమార్, మల్లాపురం అనిల్, మంజు యాదవ్, మహేష్, కుమ్మరి చంద్ర తదితరులు పాల్గొని గంగరాజుని అభినందించారు.
Share this content:
Post Comment