విదేశీ విద్యా దీవెనపై జనసేనాని స్పందిస్తే న్యాయం జరుగుతుంది: సాయి కృష్ణ

విదేశీ విద్య అనేది మద్య తరగతి కుటుంబాలకు అందని ద్రాక్ష వంటిది, కాని ఆ విదేశీ విద్యను మద్య తరగతి కుటుంబాలకు సైతం అందాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి విదేశీ విద్యాదీవెన పధకం ద్వారా మద్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్ధులు విదేశాలలో చదువుకోవడం జరుగుతుంది. అయితే 2019 సంవత్సరం నుంది స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఒపెన్ కావడం లేదు. 2019లో ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన కింద బడ్జెట్ లొ 108 కోట్లు, 2020 సంవత్సరంలో 38 కోట్లు కేటాయించడం జరిగింది. కాని విద్యార్ధులకు ఆ దబ్బులు అందట్లెదని ఆంధ్రప్రదేశ్ విజయవాడకి చెందిన సాయి కృష్ణ తేజ మడి అమెరికాలో ఉంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తే మాలాంటి విద్యార్ధులకు న్యాయం జరుగుతుందని. మద్యతరగతి యువత పై చదువులు చదువుకుంటే కుటుంబాలు బాగు పడడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా తేజ అన్నారు.