మున్సిపల్ కార్మికులకు జనసేన సంఘీభావం

మదనపల్లె: జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండవ రోజు ధర్నా నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సోదరులు అందరూ కలసి దీక్షలో రెండవ రోజు పాల్గొంటున్నారని వారికీ మదనపల్లి జనసేన పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని అన్నారు. కరోనా సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయిన పారిశుధ్య కార్మికులకీ యాబై వేల రూపాయలు ప్రకటించాలి కరోనా అయిపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంత వరకు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు, పారిశుధ్య కార్మికులు ఎంత పోరాటం చేసిన తుది దశ వరకు వారి వెంట జనసేన పార్టీ ఉండి సంపూర్ణ మద్దతు తెలియజెస్తామని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ సంక్తీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వీరి డిమాండ్ల ను పెద్దలు పవన్ కళ్యాణ్ గారి మరియు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొనివెళ్ళి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, రాజారెడ్డి, పట్టణ సెక్రటరీ నాగవేణి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆది నారాయణ, లవన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి నవాజ్, పట్టణ సెక్రటరీ జనార్దన్, సెక్రటరీ అర్జున, చంద్ర, నరేష్, దినకర్, సత్య తదితరులు పాల్గొన్నారు.