తిరుమల తిరుపతి టాక్సీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి వారు తీసుకురాగా.. ఎమ్మెల్యే ఆరణి ఆదేశాల మేరకు శనివారం తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్ ల ఆధ్వర్యంలో.. సెక్టర్ 3 సైలేంద్ర కుమార్ ను కలిసి డ్రైవర్లు పడుతున్న కష్టాలు వివరించి, వెంటనే వారికి ఉపశమనం కలిగించాలని, జీబు ఓనర్లకు, డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరగా.. తక్షణమే స్పందించి టాక్సీ, జీబ్, డ్రైవర్లకు, ఓనర్లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా తిరుమల ట్రాఫిక్ సిఐ ను కూడా కలిసి వారికి ట్రాఫిక్ సమస్యలపై, డ్రైవర్లు పడుతున్న సమస్యలపై వివరించి, పదేపదే చలానాలు వేయడం వల్ల వారు సంపాదించింది ఇంటికి కూడా తీసుకొని వెళ్లలేకపోతున్నారని, దీనిపై చర్యలు చేపట్టి తగిన న్యాయం చేకూర్చాలని జనసేన నేతలు కోరగా.. సిఐ సానుకూలంగా స్పందించి, మరొకసారి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి, జీప్ డ్రైవర్లు, ఓనర్లు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ.. అవసరమైన డాక్యుమెంటేషన్ ను సరిగా పెట్టుకోవాలని, రూల్స్ అతిక్రమించకుండా చూసుకోవాలని తెలపగా.. యూనియన్ లీడర్లు రికార్డ్స్ సరిగా పెట్టుకుని, రూల్స్ ను అతిక్రమించకుండా నడుపుకోవాలని జీబు డ్రైవర్లకు, ఓనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Share this content:
Post Comment