జనసేన ఆత్మీయ సమావేశం

శతఘ్ని న్యూస్: రాజమండ్రి సిటీ, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా రాజమండ్రి చెరుకూరి కన్వెన్షన్ హాల్ లో రాజమండ్రి సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల జనసేన నాయకుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి చైర్మన్ మరియు రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మరియు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మరియు ఇతర నియోజకవర్గాల శాసనసభ్యులతో కలిసి ఆత్మీయ సమావేశంలో పాల్గొని జనసేన నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, కూటమి ప్రభుత్వం గడచిన 6 నెలల కాలంలో చేసిన అభివృద్ధి చెబుతూ ఓటును అడిగాలని, మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరంకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మరియు హైదరాబాదులో ఎమ్మెల్సీ ఓట్లు అధికంగా ఉండటం వలన అక్కడ కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కోరడం జరిగింది. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, సూపర్ సిక్స్ పథకాలకు పూర్తిగా నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తారని, ప్రతి గ్రామంలోనూ పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో తెలుసుకుని వారిని ఓటు వేయించవలసిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, సిటీ, మండల, గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-02-17-at-12.06.20-PM-1024x650 జనసేన ఆత్మీయ సమావేశం

Share this content:

Post Comment