అడ్డతీగల మండలంలో జనసేన ఆత్మీయ సమావేశం

రంపచోడవరం నియోజకవర్గం: అడ్డతీగల మండలంలో శనివారం జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కొంతమంది స్థానిక సీనియర్ నాయకులు, పల్లాల రవి రాజశేజర్ రెడ్డి, ముత్యాల చిన్నారెడ్డి, ముత్యాల సురేష్ల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. అనంతరం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు కాకి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవ సిద్దాంతాలు రాష్ట్రంలో జరుగుతున్న రౌడి రాజకీయాలు వంటి ఎన్నో విషయాలు వివరించి మన నియోజకవర్గంలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ వంపూరి గంగూలియ్య గారు మనకు ఎలా అండగా ఉంటారో ఎలా స్పందిస్తారో విషయాలను చెప్పి భయాన్ని వీడి గ్రామాల్లో బయటకు రావాలని పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయాలో అనే దానిపై అవగాహన కల్పించారు. 2024లో మన జండను గ్రామస్థాయి నుంచి రెపరేప లాడతానికి ప్రతి ఒక్కరు కృషి చేసి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఏ ఒక్కరూ గ్రూపులు కట్టవద్దు అని మనం అందరం కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆదర్శంగా తీసుకుని బయటకు వచ్చాం కానీ ఎవ్వరిని చూసి రాలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల సీనియసర్ నాయకులు చోళ్ళ కృష్ణా రెడ్డి గారు గంగవరం మండల అధ్యక్షులు కుంజం సిద్దు, చింతూరు మండలం అధ్యక్షుడు మడివి రాజు, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు, రంపచోడవరం నియోజకవర్గ సీనియర్ నాయకులు రాగల సురేష్, మట్టా సందీప్, సోము శివ మొదలైన జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.