గజపతినగరంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరం జనసేన కార్యాలయంలో పార్టీ బలోపేతానికై కార్యకర్తలతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణ హాజరై పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. అనంతరం జనసేన పార్టీ నాయుకులు, కార్యకర్తలు పార్టీలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణను ఘనంగా సన్మానించడం జరిగింది.