పానగల్ మండలంలో జనసేన ఆత్మీయ సమావేశం

తెలంగాణ, కొల్లాపూర్, పానగల్ మండలం పరిధిలో ఉన్న వివిధ గ్రామాల జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భైరపోగు సాంబశివుడు జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని పానగల్ మండలంలో అన్ని గ్రామాలలో విస్తరించే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాలని జనసేన పార్టీని ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భవిష్యత్తులో జరగబోయే స్థానిక ఎన్నికలలో బలమైన శక్తిగా ప్రజా సమస్యలే పరిష్కార ఎజెండాగా ముందుకు వెళ్లాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాన్ని ఈ సమాజంలో వెనుకబాటుకు గురవుతున్న సామాజిక వర్గాలను రాజకీయంగా జనసేన పార్టీ వెనుక ఉండి నడిపించే విధంగానే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలను సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీని పానగల్ మండల పరిధిలో బలమైన శక్తిగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి జనసైనికుడు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగానే ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైన మద్దతుదారులు ఉన్నారు. వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా భవిష్యత్తు రాజకీయాలను భవిష్యత్తుతరాలకు భవిష్యత్తు నిచ్చే పార్టీగా ప్రజల పార్టీగా ఇది మన అందరి పార్టీగా అనుకునే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త జనసైనికులు పార్టీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీద కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన అమరవీరుల ఆశయాలకు అనుగుణంగానే జనసేన పార్టీ రాష్ట్రంలో ముందుకెళుతుంది కాబట్టి ఆ దిశగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఇన్చార్జి నేమురి శంకర్ గౌడ్ మరియు ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం ఆ దిశగానే తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి జనసేన పార్టీకి అండగా ఉండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసైనికునికి ఎంతో అవసరమని, అప్పుడే వెనకబాటుకు గురైన సమాజానికి గొప్ప రాజకీయ పార్టీని అందించిన వాళ్లమవుతామని సందర్భంగా జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల నాయకులు తల్లారి మల్లేష్, బత్తిని బాలు, అలాగే పానగల్ మండల కేంద్రంనుంచి భరత్, నవీన్, ముసిరెడ్డి గ్రామ నాయకులు శివ, మౌలాలి, లక్ష్మణ్, జీవన్, రాజ్ కుమార్, శ్రీకాంత్, పెంటయ్య, మందాపూర్ గ్రామం నుంచి పరమేష్, సాయి, యాదగిరి, జమ్మాపురం గ్రామం నుంచి నాని గౌడ్, సతీష్, బహదూర్ గూడెం గ్రామం నుంచి వంశీ, నరేందర్, అరుణ్
తదితరులు పాల్గొన్నారు.