కార్యకర్తలకు జనసేన భరోసాగా నిలుస్తుంది: తాడికొండ ప్రవీణ్

  • క్రియాశీలక సభ్యత్వ ప్లకార్డ్స్, పాంప్లెట్స్ రిలీజ్

అశ్వారావుపేట: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇంచార్ రామ్ తాళ్లూరి సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్లకార్డ్స్, పాంఫ్లెట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాడికొండ ప్రవీణ్ మాట్లాడుతూ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం జనసేన పార్టీ తీసుకుంది, అదే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అని జనసేన పార్టీకి కార్యకర్తలే మా బలం, వారే మా సంపద, జనసైనికులు, వీరమహిళలు మరియు వారి కుటుంబాలకు అండగా పార్టీ, జెండా వారి భుజాన మోసే కార్యకర్తల సంకల్పం, పట్టుదలను జనసేన పార్టీ ఎన్నడూ విస్మరించదు అని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రయోజనాలు పార్టీతో ప్రత్యక్ష అనుబంధం, పార్టీ బలోపేతం కోసం ఏర్పడబోయే వివిధ కమిటీలలో స్థానాలు, పార్టీ కార్యక్రమాల్లో మీకు భాగస్వామ్యం, పార్టీ ఐడి కార్డు, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రమాద బీమా, ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబానికి అండగా 5 లక్షల రూపాయల బీమా పథకం వర్తిస్తుందని తెలియజేశారు. ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణించిన 96 మంది జనసేన కార్యకర్తలు మరణించారని వారి కుటుంబాలకు నేటి వరకు 4 కోట్ల 80 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు గాయపడిన 169 మంది కార్యకర్తలకు 60 లక్షల 90 వేల రూపాయలు, నేటి వరకు మొత్తం జీవిత బీమా కింద 5 కోట్ల 40 లక్షల 90 వేల రూపాయలు పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుని గాయపడిన మరియు మరణించిన కుటుంబాలకు అందజేశారు అని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడానికి మీ ఆధార్ కార్డు, మీ నామిని ఆధార్ కార్డు, మీ ఫోటో మీ పర్మనెంట్ ఫోన్ నెంబర్ 500 రూపాయలతో సభ్యత్వం చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని క్రియాశీలక సభ్యత్వం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికే రాంబాబు, గొల్ల వీరభద్రం, మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి ఊకె నాగరాజు, కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, కందుకూరి వినీత్, ముదిగొండ సాగర్, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు.