షేక్ సోనీకి అండగా జనసేన

గుంతకల్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో పామిడి పట్టణానికి చెందిన షేక్ సోనీ తల్లితండ్రులను కోల్పోయి మానసికంగా కృంగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యింది. ఆదివారం ఆమె చికిత్స నిమిత్తము సుమారు లక్ష రూపాయలు అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పామిడి మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఆ అమ్మాయి పరిస్థితిని చూసి చలించిపోయి, పవన్ కళ్యాణ్ ఏదైతే ఎప్పుడూ అభిమానులకు చెపుతుంటారో కష్టాల్లో ఉన్నవారికి మన వంతు భరోసాగా నిలబడుదాం, ఆపదలో ఉన్నవారికి మన వంతు ఆపన్న హస్తాన్ని అందిద్దాం అన్న నాయకుడి మాటలను స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు బాధ్యతగా అందరూ డబ్బును జమ చేసి సుమారు11,710/- రూపాయలు ఆదివారం ఆ చిట్టి తల్లి చేతికే ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి జనసేన పార్టీ నాయకులను చూసి పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న కండువా నాకు కావాలి నేను వేసుకుంటా అంటూ మా మెడలోని కండువాని తీసుకొని తను తన మెడలో వేసుకొని మానసికంగా తను సరిగా లేకున్నా పవన్ కళ్యాణ్ బొమ్మను చూస్తూ ఆనందపడిన వైనన్ని చూస్తే మాకెంతో సంతోషం అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం అన్నది అర్థమైంది, ఆ అమ్మాయి చికిత్స చేయించుకొని త్వరగా పూర్తి ఆయురారోగ్యాలతో అందరి అమ్మాయిల్లాగా తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అందరం ఆ భగవంతున్ని ప్రార్ధించారు. సహకరించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, పేరుపేరునా జనసేన పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కరించారు.