6వ దశ కార్మికులకు అండగా జనసేన..!

కే.టి.పి.ఎస్ 6వ దశ నిర్మాణ కార్మికులకు న్యాయం చెయ్యాలని పాల్వంచ కే.టి.పి.ఎస్ అంబేద్కర్ సెంటర్ లో 6వ దశ నిర్మాణ కార్మికులు చేస్తున్న దీక్షకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం దీక్ష చేస్తున్న 6వ దశ నిర్మాణ కార్మికులను ఉద్దేశించి పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ బ్రహ్మం, మండల అధ్యక్షులు దేవా గౌడ్ మాట్లాడుతూ గతంలో 6 వ దశ నిర్మాణంలో కీలక పాత్ర పోశిషించిన కార్మికులకు నిర్మాణం అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి మాటతప్పిన జెన్కో అధికారులు అని గత ప్రభుత్వం కూడ ఈ కార్మికులకు న్యాయం చేస్తామని మాటలు చెప్పిందే తప్ప వీరికి ఎటువంటి న్యాయం చెయ్యలేదని అన్నారు నిర్మాణం లో ఎటువంటి సంబంధం లేని వారికీ ఆర్టిజన్ పోస్ట్లు ఇచ్చారని 6వ దశ నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముగిత్యాల భాస్కర్ సాయి తేజ్ బాలాజీ, ప్రసాద్, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment