అంబటి మదయ్యకు అండగా జనసేన

ఇచ్చాపురం మండలం మశఖపురం గ్రామంలో లివర్ జాండిస్ అనే వ్యాధితో బాధపడుతున్న అంబటి మదయ్య అనే వ్యక్తికి మశాఖపురం గ్రామ యువకులు తమ వంతు 15000 రూపాయలు మరియు పవన్ సేవా సంస్థ నుండి 4000 రూపాయలు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జనసేన తిప్పన దుర్యోధన రెడ్డి చేతుల మీదగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజు ప్రేమ్ ధర్మరాజు ప్రేమ్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని మంచి కార్యాల కోసం అందరు ముందుకు వస్తారని కోరుకుంటున్నామని అన్నారు.