అంగన్వాడీ సిబ్బందికి అండగా జనసేన: చొప్పా చంద్రశేఖర్

సింగనమల నియోజకవర్గం: ప్రతి మండలంలో సమ్మెలు చేస్తున్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధినాయకులైనశ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుక్కరాయసముద్రం మరియు గార్లదిన్నే మండలాల్లో గత నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకు సిబ్బందికి అండగా ఉంటామని జనసేన జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి న్యాయమైన పోరాటమునకు ఆటంకం కలిగించే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అంగన్వాడీ సిబ్బందికి అండగా వుంటుందని, వారి న్యాయమైన పోరాటంలో పాలు పంచుకుంటుందని అధికారంలోకి రాకముందు వారికి పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ జీతాలు ఇస్తానని, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని మాట ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి అధికారం రాగానే మాట తప్పాడని, అతని పదవీకాలం అయిపోతున్నా గాని వారి సమస్యలపై ఏ విధంగా న్యాయం చేయలేకపోగా వారు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు రౌడీ రాజకీయం ద్వారా బెదిరిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నందున జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని అలాగే సమాన పనికి సమాన వేతనం, కనీసం వారి కుటుంబ పోషణకు నెలకు 26 వేల రూపాయల పారితోషకం, వారికి వృద్ధాప్య సమయంలో ఇతర సహాయ సహకారాలు ఇవ్వటం న్యాయమైందని ఎందుకంటే మన సమాజంలో పోషకాహారాలు అందని ఎన్నో పేద కుటుంబాల పిల్లలకు, బాలింతలకు వారు చేస్తున్నటువంటి సేవలు వర్ణనాతీతం. ఇటువంటి వారికి అన్యాయం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించడం జరిగింది. ఈ మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి వ్యవస్థలను నీరు కారుస్తూ నియంత స్వభావంతో వ్యవస్థలను అతలాకుతలం చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును అంధకారం వైపు నెట్టాడని. రేపటి మన భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరమని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మురళీకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తి, మండల అధ్యక్షులు తాతయ్య, ఎర్రి స్వామి మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి, తాహిర్ విశ్వనాధ్. అవ్వాలి రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.