- 40 లక్షలు విలువచేసే స్థలాన్ని ఆక్రమించి, తప్పుడు పత్రాలు ఫోర్జరీ కాగితాలు సృష్టించారు
- 4 సంవత్సరాల నుండి న్యాయపోరాటం చేస్తున్న బెజవాడ శాంతి కుమారి
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో జరుగుమల్లి మండలంలో రామచంద్రాపురం గ్రామానికి చెందిన బెజవాడ శాంతి కుమారి మరియు వారి భర్త లక్ష్మీనరసింహంలకు పూర్వీకుల ద్వారా ఆస్థి సంక్రమించింది, వారి పేరు మీద డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 2019 వ సంవత్సరంలో 81 సెంట్లు భూమిని లీజ్ కు రాయించుకుని రెంట్ కట్టకుండా ఆ స్థలంలో అక్రమ కట్టడాలు కట్టి, తప్పుడు పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకాలు చేసి దాదాపుగా 40 లక్షలు విలువచేసే స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు. నా స్థలం కోసం దాదాపు 4 సంవత్సరాల నుండి న్యాయపోరాటం చేస్తూ ఉన్నాను, నా స్థలాన్ని అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించాలని ప్రయత్నిస్తు నన్ను అసభ్యకరంగా తిడుతూ చంపుతామని బెదిరిస్తున్నారు అంటూ న్యాయం కోసం మంగళవారం జనసేన పార్టీ నాయకులను బెజవాడ శాంతి కుమారి కలిశారు. బెజవాడ శాంతి కుమారికి అండగా జనసేన పార్టీ ఉంటుంది, న్యాయ పోరాటం చేస్తాము అంటూ జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్, సింగరాయకొండ మండలం అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, సింగరాయకొండ మండలం ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాసులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment