ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, చౌటపాలెం గ్రామానికి చెందిన గుత్తికొండ చెన్నమ్మ అనే మహిళకు పూర్వికుల నుండి భూమి వారసత్వంగా వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో గుత్తికొండ చెన్నమ్మకి తెలియకుండా ఆమె భూమిని మరొకరు ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవడం జరిగింది. భూమి మాత్రం ఆమె ఆధ్వర్యంలో సాగు చేసుకుంటూ ఉంది, కానీ పేరు మాత్రం ఆన్లైన్లో మరొకరు నమోదు చేసుకుని ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని గుత్తికొండ చెన్నమ్మ వెళ్లి అడగగా ఆమెను బెదిరిస్తూ దుర్బషలాడారు. ఈ భూమి సమస్య మీద గత సంవత్సరం నుండి బాధితురాలు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. మంగళవారం న్యాయం కోసం జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించారు. గుత్తికొండ చెన్నమ్మకి జనసేన పార్టీ అండగా ఉంటుంది, వారికి న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ పిఓసి కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండల జనసేన పార్టీ నాయకులు యలమందల మాల్యాద్రి, తిరుమలరెడ్డి, పత్తిపాటి మాధవరావు, ఖాజావలి, గోగన చిన్నబాబు, నల్లపు పెద్ద బ్రహ్మయ్య, బిరుదుల దానయ్య, మువ్వా చిన్న పాల్గొన్నారు.
Share this content:
Post Comment