లింగమ్మకు అండగా జనసేన

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం పరిగి కురుబ వీధికి చెందిన లింగమ్మ అనే మహిళ రేషన్ కార్డు కొరకు చాలా కాలం నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో స్థానిక జనసేన నాయకుడు బాలచంద్ర ద్వారా సమస్యను మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆర్.సురేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి రేషన్ కార్డు నమోదు చేయించడం జరిగింది. అధికారులు స్పందించి వెంటనే రేషన్ కార్డు అందిస్తాం అన్నారు.