కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన

పిఠాపురం మండలం, రాపర్తి గ్రామంలో సీనియర్ కార్యకర్త అయిన కోన గనిరాజు మావయ్య ఇటీవల కాలం చేయడం జరిగింది. బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రాపర్తి జనసేన నాయకులు ఆర్య సూర్నీడి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జనసైనికులు అందరూ కలిపి రూపాయలు 32000/- ఆర్థిక సహాయం పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, నియోజకవర్గ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, రాపర్తి జనసేన నాయకులు కీర్తి చంటి, వీరఒరెడ్డి అమర్, దేశనీడి బాబ్జి, యాతం రాజు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment