జనసైనికుడు వీరబాబు కుటుంబానికి అండగా జనసేన

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, కాపవరం గ్రామనికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు పేలూరి వీరబాబు అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబాన్ని మంగళవారం అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పరామర్శించి, ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 10000 రూపాయలు మరియు నియోజవర్గ జనసైనికులు సమకూర్చిన 50 వేల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిక్కవోలు అనపర్తి రంగంపేట మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, ఎన్.ఆర్.కే ప్రసాద్ రెడ్డి, గిరిజాల సత్తిబాబు, ఉపాధ్యక్షులు కోరడ రామారావు, కామకు అరుణ్ కుమార్, వీరమహిళ వెంకటలక్ష్మి, బిక్కవోలు మండల యూత్ ప్రెసిడెంట్ కొండబాబు, మండల ప్రధాన కార్యదర్శి కొట్టు దుర్గాప్రసాద్, మండల కమిటీ సభ్యులు ముమ్మిడి వీర రాఘవ, బిక్కవోలు గ్రామ శాఖ అధ్యక్షులు తోట సతీష్, జనసేన నాయకులు వడ్లమూరు గోవిందరాజు, హరీష్, శ్రీను, కాపవరం జనసైనికులు పాల్గొన్నారు.