మోకా నాగవేణి కుటుంబానికి అండగా జనసేన

ముమ్మిడివరం మండలం, క్రాప చింతలపూడి గరువుకి చెందిన మోకా నాగవేణి ఇటివీలే మరణించారు. దిగువ మధ్య తరగతి చెందిన ఆ కుటుంబానికి అల్లవరం మండలం జనసేన పార్టీ వీరమహిళ గోళ్ల కమల సహకారంతో వారికి స్థానిక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు చింతలపూడి రాజారావు చేతుల మీదుగా నిత్యవసర వస్తువులు అందించడం సోమవారం జరిగింది. దీనికిగాను ఆ కుటుంబ సభ్యులు మహిళా జనసేన నాయకురాలు కమలకి కృతజ్ఞతలు తెలిపారు.