నిరుపేద కుటుంబానికి అండగా జనసేన

ముసలి నాయుడుపాలెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం అద్దెకు ఉంటున్నారు. ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని విషయం తెలియగానే.. ఆ కుటుంబానికి కోన చిన అప్పారావు చేతుల మీదుగా నెలకు సరిపడా గ్రాసరీ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ పెద్దకి యాక్సిడెంట్ అయ్యి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. తన భార్య బాలింత.. ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు తెలియజేయగా.. నేను వెంటనే నా ఫ్రెండ్స్ సంప్రదించగా నీళ్ల సాయి వారి తండ్రి సన్యాసిరావు గారి జ్ఞాపకార్థం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి 2500 విలువచేసే గ్రోసరీస్ ఇవ్వడం జరిగినది.. అలాగే ఏ అవసరం వచ్చినా.. మమ్మల్ని సంప్రదించమని వాళ్లకి భరోసా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో.. ప్రేమని దీ ఫౌండేషన్ చైర్మన్ జనసేన నాయకులు అంజూర దీపక్, 75 వా వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోన పద్మ, వైభవ్ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ జనసేన వీర మహిళ జ్యోతి రెడ్డి దాసరి, నీలాపు శ్రీనివాస్ రెడ్డి, ఇంటాక్ నాయకులు కోరిబిల్లి అప్పారావు, కింతడా రామకృష్ణ, కోన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.