అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి అండగా జనసేన

విశాఖ పశ్చిమ నియోజకవర్గం: పారిశ్రామిక ప్రాంతం, 61వ వార్డులో, శెట్టి బలిజల వీధిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబాన్ని వార్డు అధ్యక్షులు దుంగ దేవన్ రాజు ద్రుష్టికి తీసుకువెళ్లటంతో వారికి నెల రోజులు నిత్యావసర సరుకులు ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. ఇందులో వీరమహిల శంకరమ్మ, జనసేన శ్రేణులు శంకర్, మోహన్, వంశీ పాల్గొన్నారు.