అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన సంఘీభావం

ఇచ్చాపురం: అంగన్వాడి టీచర్స్ మరియు ఆయాల ప్రధాన డిమాండ్స్ ను పరిష్కరించాలని చలో విజయవాడ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్స్ ను మరియు ఆయాలను రైల్వే స్టేషన్లో నిర్బంధించి పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి వాళ్లని పరామర్శించి, వారికి సంఘీభావం తెలిపి వారి సమస్యలను అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే ఇంతకుముందు తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడి టీచర్లకు మరియు ఆయాలకు 1000 రూపాయలు అధికంగా అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అంగన్వాడి టీచర్లు, ఆయాల ప్రధాన డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా దాసరి రాజుగారు కోరడం జరిగింది. అంగన్వాడి టీచర్లు, ఆయాలు చేస్తున్న ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం వారిని నిర్బంధించడం సరికాదని అన్నారు. అవసరమైతే జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని అంగన్వాడీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.