కొత్తవలసలో అంగన్వాడి ఉద్యోగుల నిరసనకు జనసేన సంఘీభావం

శృంగవరపుకోట: కొత్తవలస ఎం.పి.డి.ఓ కార్యాలయం వద్ద అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి జనసేన తరఫున సంఘీభావం తెలిపిన శృంగవరపుకోట ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ. కార్యక్రమంలో ఆయన అంగన్వాడీల సమస్యలను మరియు వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి సమంజసమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం వెంటనే చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారిపై ఎటువంటి అణిచివేత ధోరణి తగదని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించలేని ఎడల మరొక మూడు నెలల్లో జనసేన మరియు టిడిపి సంయుక్త గవర్నమెంట్ వచ్చినాక కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రుద్ర అప్పలనాయుడు, మల్లువలస శ్రీను (పార్లమెంటరీ కమిటీ ఎగ్జిక్యూటివ్), పిల్ల రామదుర్గ పాల్గొన్నారు.