Hyderabad: డ్రగ్స్ పై జనసేన ఉక్కుపాదం – నవంబర్ 1 నుండి రిలే నిరాహారదీక్ష

తెలంగాణలో పెరుగుతున్న గంజాయ్ మరియు డ్రగ్ మాఫియా అరాచకాల మీద జనసేనపార్టీ రిలే నిరాహారదీక్ష చేపట్టనుంది. నవంబర్ 1వ తేదీ న ఉదయం 10 గంటలకు జనసేనపార్టీ నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ కు గ్రేటర్ కమిటీ సభ్యులు, గ్రేటర్ డివిజన్ల కమిటీ సభ్యులు, గ్రేటర్ పరిధిలోని జనసైనికులు, వీరమహిళలు మరియు జనసైనికులు అందరూ రావాల్సిందిగా తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు.