క్యాన్సర్ బాధితునికి జనసేన ఆర్ధికసాయం

పాయకరావుపేట నియోజకవర్గం: ఎస్. రాయవరం మండలం, తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు శానాపతి బాబురావు (మాస్టారు), పప్పల శివ, ప్రసాదుల గణేషు, అప్పికొండ లోవ రాజు, శానపతి రాజు, వంగలపూడి నానాజీ, దమ్ము రాజు, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, నర్సింగపురంలో నోటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కళ్యాణ్ రాజుకు బుధవారం జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ మాకినిడి శేషుకుమారితో చర్చించాక కొంత నగదు, నిత్యావసర సరుకులు డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ చేతుల మీదగా నర్సింగపురం గ్రామ పెద్దలు సలాది సుబ్బారావు, ఓలేటి సాయి రెడ్డి, వార్డ్ మెంబర్ గంజి రామకృష్ణ, పెద్దింటి శివ, శాఖ సురేష్, జనసేన నాయకులు జనసైనికుల సమక్షంలో అందజేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాకా బేడ బుడగ జంగాలకు కుల ధృవీకరణ కల్పించి, వారి బ్రతుకులో ఇకనైనా మంచి భవిష్యత్ కల్పించాలని రోగి తాలుకా బంధువులు జనసేన నాయకులను కోరారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్లు నాయకులు తెలిపారు.