జనసైనికుని కుటుంబానికి అండగా నిలచిన జనసేన

విశాఖ తూర్పు: ఇటీవలి విశాఖ తూర్పు నియోజకవర్గం 21వ వార్డుకు చెందిన జనసైనికుడు కోన కామేష్ కిడ్నీ ప్రాబ్లం తో చనిపోవడం జరిగింది.. ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయంలో శ్రీమతి యడ్లపల్లి కళా, కీర్తిశేషులు కోన కామేష్ భార్యకు పార్టీ తరుపున మనం నిలబడాలనిలబడాలనే ఉద్దేశంతో కామేష్ కుటుంబ ప్రస్తుతం ఖర్చులకోసం 30000/- రూపాయలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసైనికుడు కోన కామేష్ కుమార్తెకు సంవత్సరం పాటు ప్రతినెల 5000/- రూపాయలు డిపాజిట్ చేస్తామని శ్రీమతి యడ్లపల్లి కళ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కళ మాట్లాడుతూ.. జనసేన అంటే ఒక కుటుంబం అని నిరూపిద్దాం. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుద్దాం అని పిలుపునిచ్చారు.