రోడ్డు విస్తరణతో ఇబ్బంది పడుతున్న చంద్రగిరి రైతాంగం – అండగా నిలిచిన జనసేన

  • అండగా నిలిచిన జనసేన పార్టి, దేవర మనోహర
  • దిగివచ్చిన అధికార యంత్రాంగం

చంద్రగిరి, ఇటీవల వెలుగులోకి వచ్చిన, చంద్రగిరి మండలంలో హైవే రోడ్డుకి ఆనుకొని ఉన్న వ్యసాయ భూములలో వరద నీరు చేరడంతో రైతులకు కన్నీరు మాత్రమే మిగులుతుందని, అక్కడి రైతులు జనసేనపార్టీ నాయకులు దేవర మనోహరకు తెలిపారు. వరద నీటి ఉధృతికి రోడ్డు దెబ్బతినకుండా ఉండాలని ఎన్.హెచ్.ఏ.ఐ. రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన చర్యల్లో భాగంగా ఇంజనీర్ల పని తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షాకాలంలో కురిసే వర్షాలకు పారుతున్న చిన్న, పెద్ద వాగులను మరచి రోడ్డు విస్తరణ పనుల సర్వే నిర్వహించి, రోడ్డు నిర్మించడం వల్ల చుట్టు పక్కల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చంద్రగిరి లెక్క దాఖలా సర్వే నెంబరు 318 నందు ఉన్న 135 అడుగుల విస్తీర్ణం గల వాగును కుడి నుండి ఎడమ వైపునకు ఎస్.హెచ్.ఎ.ఐ. అధికారులు మళ్లించారు. దీంతో సుమారు 6 నుండి 7 ఎకరాల భూములు అన్యాక్రాంతం కావడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. సదరు సర్వే నెంబరులోని వాగును
చుట్టు ప్రక్కల ఉన్న రైతులు ఆక్రమించుకొని భూమిని ఎత్తుగా చేయడం వల్ల సర్వ్ నెంబర్ 331, 327, 328 నందు గల భూములు ముంపునకు గురవుతున్నాయి. కొత్తగా వేసిన రియల్ ఎస్టేట్ సర్వే నెంబర్ 318, 324 నందు ఉన్న వాగుకి వర్షపు చేరలేక, క్రాస్ డ్రైన్ వలన విక్రమ్ పెట్రోల్ బంక్, పాత స్సన్ పైప్స్ స్థలము వద్ద రోడ్డుకి అనుకొని వున్న వాగు స్థలం పూర్తిగా ఎన్.హెచ్.ఎ.ఐ వారు వేసిన రోడ్డు వలన వర్షాకాలంలో పెద్దఎత్తున నీరు చుట్టు ప్రక్కల పట్టా భూముల్లో నిలిచి పోవడంతో పంట
చేతికి రాక నష్టం వాటిల్లుతుంది. ఎన్.హెచ్ఎ.ఐ.ఒ వారి ముందస్తు నీరువర్షపు నీటికి కూలిన ప్రహరీ గోడ
ప్రణాళికలు లేని కారణంగా వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా బీభత్స వాతావరణం తలపిస్తున్నది, ఎన్.హెచ్.ఎ.ఐ వారు విక్రమ్
పెట్రోల్ బంక్, మల్లయ్యపల్లి మలుపు వద్ద సుమారు రూ.కోటి తో నిర్మించిన కల్వర్టు నిరుపయోగం ఉండటమే కాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులుకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ భూమిని ఓ బడా వ్యక్తి ఆక్రమించుకోవడం విచారకరం. అక్కడి సర్వే నం. 318, 324 లోని సుమారు 7 ఎకరాలు వెంచర్లకు తోడు ఎస్ హెచ్ ఎ ఐ వారి నిర్వాకంతో కిలారి గార్డెన్స్ వెంచర్ తూర్పున గల ప్రహరీ కూలిపోవడంతో ఆ ప్రహరీ గోడక
తూర్పున ఉన్న రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి జనసేనపార్టి అండగా ఉంటుందని ఆ పార్టీ నియజకవర్గ నాయకులు, జిల్లా కార్యదర్శి దేవర మనోహర తెలిపి దీనిపై సమగ్ర విచారణ జరిపి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి రైస్తులకు న్యాయం చేయాలని స్థానిక ఇరిగేషన్ ఈ.ఈ కి బాధిత రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై నేడు జనసేనపార్టి నాలుగు శాఖల(ఇరిగేషన్, ఎన్.హెచ్.ఎ.ఐ, ఆర్ అండ్ బి, రెవెన్యూ) అధికారులతో సమీక్షించి రైతులతో మాట్లాడించి, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపటున్ననారని అధికారులు మరియు ఎం.ఆర్.ఓ హామీ ఇవ్వడంతో రైతులు ఆనందంతో జనసేనపార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్ కి, దేవర మనోహరకి కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.