నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన జనసేన

కందుకూరు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో రావినూతల దేవసహాయం, ఆయన భార్య మరియమ్మ దంపతుల పేద కుటుంబానికి గుడ్లూరు, ఉలవపాడు మండలాల జనసైనికులు సోమవారం నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు 25 కేజీల బియ్యం, 2000/- నగదు రూపంలో సాయం చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే దేవ సహాయం నరాల బలహీనతతో ఏ పని చేయలేడు, దానికి తోడు చెవుడు, వినపడదు, మరియమ్మ వికలాంగురాలు వారికి ఇద్దరు పిల్లలు. ఒకపాప వయసు తల్లి పాలు తాగే వయసు. ఈ పాపకు తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితి మరియమ్మది. సొంత ఇల్లు కూడా లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని ఈరోజుల్లో రెక్కాడని దీనస్థితి దేవసహాయం, మరియమ్మలది. ఇలాంటి పరిస్థితి గురించి సుమన్ అనే స్థానిక జనసైనికుడు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఆశయాలు నెరవేరాలనే మానవతా దృక్పథంతో ఉలవపాడు మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన జనసైనికుడు ఆలూరి ప్రతాప్ 2000/- విలువ గల 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, లింగసముద్రం మండలం చినపవని గ్రామానికి చెందిన జనసైనికుడు ఇనకొల్లు శ్రీనివాస్ 1000/- నగదు, గుడ్లూరు మండలం జనసైనికులు మూలగిరి శ్రీనివాస్ 500/- నగదు, అన్నంగి చలపతి 500/- నగదు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కూడా పూర్తి ఆర్ధిక భరోసాపై కుటుంబానికి ఇవ్వకపోవచ్చు కానీ, ఉడతసాయం చేశామనే తృప్తి ఉంది. వైకాపా ప్రభుత్వం ఘనంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తమ సొంత మీడియా, అనుకూల మీడియాలలో గొప్పలు చెప్పుకోవడమే గానీ, వాస్తవంలో పై ఉదహరించిన కుటుంబాలు కోకొల్లలు. “జనసేన సామాన్యుడు సేన” అని ఎందుకు అంటామంటే పై సాయం చేసిన వ్యక్తులు సామాన్యులు, పేదవారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు. కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాలు, మానవతా దృక్పథం మాత్రమే జనసైనికులను నడిపిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవ రావు, అన్నంగి చలపతి, కె. రాజేష్, ఆలూరి ప్రతాప్, కె. లక్ష్మణ్, సుమన్, మెత్తల రాంకీ, రావినూతల జాకోబు రావినూతల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.