వెంకటేశ్వర్లు కుటుంబానికి అండగా నిలచిన జనసేన

సత్తెనపల్లి: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో అన్నెం వెంకటేశ్వర్లు, భార్య సామ్రాజ్యం దంపతులు సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు దమ్మాలపాడు చేరుకొని వారికి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా పార్టీ తరఫున ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చి 10,000 ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.