ఆటోలు నడుపుకుంటున్న పేద బిడ్డలకు అండగా జనసేన విద్యార్థి విభాగం

హైదరాబాద్, డిగ్రీలు చదివి పొట్ట చేత పట్టుకొని వివిధ జిల్లాల నుండి వచ్చి హైదరాబాద్ లో ఆటోలు నడుపుకుంటున్న పేద బిడ్డలకు జనసేన విద్యార్థి విభాగం అండగా నిలబడడం జరిగింది. వారి ఆటోలను నడవనివ్వకుండా వారిపై ఆంక్షలు విధించడంతో దాదాపు 25 వేల కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ సమస్యను జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వారి సమస్యని 300ల ఆటోలతో ర్యాలీగా వెళ్లి హైదరాబాద్ కమిషనర్ మమత జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆటోలు హైదరాబాద్ లోనే కొనుక్కున్నారు, వారి మీటర్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ లోనే ఉంది అయినప్పటికీ ఒక్కొక్కరి దగ్గర 15 వేల నుండి 20 వేల చలాన్ లు వసూలు చేస్తూ ఆటోలు నడపనివ్వడం లేదని వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం వీరి పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తుంది అని తెలియజేశారు. ఈ సమస్యని వారం రోజుల్లో పరిష్కరిస్తామని కమిషన్ మమత, జాయింట్ కమిషనర్ పాండురంగ నాయక్ హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, విద్యార్థి నాయకులు హరీష్ తదితరులు పాల్గొన్నారు.