ఉప్పులూరు సచివాలయ ఈఓ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండల పరిధిలోని ఉప్పులూరులో ఇందిరమ్మ కాలనీలు నిర్మించి 10 సంవత్సరాలు అవుతున్నా మూడు ప్రభుత్వాలు మారినా ఇప్పటి వరకు డ్రైనేజి నిర్మించకపోవటంపై మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉప్పులూరు సచివాలయ ఈఓ కి వినతిపత్రం అందచేయటం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ నాయకులు పులి కామేశ్వరవు మాట్లాడుతూ 60 40 ప్రభుత్వాలు ఈ రోడ్ల పై నడిచి వెళ్లి వీళ్ళతో ఓట్లు వెపించుకున్నారు కానీ గెలిచాక రోడ్లు పక్కన ఉన్న డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి అనే ఆలోచన వాళ్ళకి రాకపోవటం చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్య పరిష్కరిస్తే సరే లేకుంటే దీనిని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తానికి జనసేన సిద్ధం అని అన్నారు….కంకిపాడు మండల అధ్యక్షులు ముప్పా రాజా మాట్లాడుతూ ఈ డ్రైనేజీ సమస్య వలన మలేరియా డెంగ్యు వంటి విషజ్వరాలు వలన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు..ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్య పై స్పందించకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పులూరు జనసైనికులు వెంకటేష్, హరి కృష్ణ, ముప్పిరి మోహన్ బోస్, హసన్, మణికంఠ, సుధీర్, రాఖీ, కంకిపాడు జనసేన నాయకులు బోయిన నాగరాజు, సుంకర శివ శేఖర్ చొక్కా రాజా గంగా క్రాంతి సురేష్ రామరాజు కోటయ్య అన్సార్ పాండు నరహరిశెట్టి పవన్, కంకిపాడు జనసైనికులు పాల్గొన్నారు.