అంగన్వాడీల సమ్మెకు జనసేన మద్దతు

రాయచోటి: అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరి సరైంది కాదని రాజంపేట పార్లమెంటరీ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు రాయచోటి జనసేన సమన్వయకర్త ఫఠాన్, రాయచోటి జనసేన నేత బుడ్డా నాగభూషణం, రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షులు చిన్నారి జయరామ్ మరియు జనసైనికులు సమ్మెకు ముక్తకంఠంతో అంగన్వాడీల మీద యస్మా చట్ట ప్రయోగం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. అధికారులు అత్యుత్సాహంతో వర్కర్లకు షోకాజ్ నోటీసు లివ్వఢం మూర్ఖత్వం అన్నారు. సేవల రంగంలో విస్తృత సేవలందిస్తున్న అంగన్వాడీల పట్ల విధానం సరైంది కాదన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కార్మిక సంఘాలు ప్రజా ఉద్యమాలు పెరిగాయని, ప్రభుత్వ పతనం తప్పదని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి.. ప్రజా సంఘాల నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె విచ్చిన్నం చేయడానికి జీ ఓ నంబర్ రెండు పేరుతో యస్మా చట్టం తీసుకురావడం చట్ట వ్యతిరేకమని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. రాయచోటి తాశీల్ధార్ ఎదుటు రోడ్ మీద రాస్తారోకో యస్ యఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సీఐటీయూ జిల్లాప్రధాన కార్యదర్శిఎ రామాంజులు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి గా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యం ఆర్ పీయస్ నేత రామంజులు, రైతు సంఘం జిల్లాప్రధాన కార్యదర్శి యస్ రామచంద్ర కెవీపీయస్ జిల్లా కో కన్వీనర్ వెంకటయ్య రజక సంఘం శ్రీనివాసులు వడ్డెం సంఘం రెడ్డెయ్యలు పాల్గొన్నారు.