పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు

ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయక మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు భైంసా కు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ తరపున మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు లేఖ పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ పంచాయతీ శాఖ, జనసేన పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వాములుగా బిజెపి అభ్యర్థి అంజి రెడ్డి ఎమ్మెల్సీ పోటీలో గెలుపు కోసం జనసేన పార్టీ తరపున పూర్తి మద్దతూ తెలియజేసారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ప్రతి సమస్య పరిష్కారంలో ముందుండి మా వంతు కృషి చేసామని, ఇక ముందు కూడా వారికి ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం దిశగా ఆలోచన చేసే వ్యక్తి భవిష్యత్తులో మేధావి వర్గం శాసన మండలిలో తమ గొంతును వినిపించే విదంగా అంజి రెడ్డి గెలుపు ఖాయం చేసి తీరుతామని తెలియజేసారు.

Share this content:

Post Comment