అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి జనసేన అండ

ప్రత్తిపాడు: నెల్లిపూడికి చెందిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ప్రత్తిపాడు జనసేన నాయకులు పలకరించి వారికి జనసేన అండగా ఉంటుందని బరోసా ఇచ్చి, ఆర్దికసహయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబు, మరియు నెల్లిపుడి ప్రముఖ నాయకులు బుజ్జి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నల్లల రామక్రిష్ణ, ఏలేశ్వరం మండలం అధ్యక్షులు పెంటకోట మోహన్, పలివెల వెంకటేష్, గోవిందు నాగేశ్వరరావు, బాధిత కుటుంబానికి జనసేన సానుభూతి పరులు దుప్పట్లు, బోజనాలు, బియ్యం, కూరగాయలు ఇచ్చారు. సోమవారం ఆ కుటుంబానికి మరింత ఆర్ధిక సహాయం చేసి వారికీ అండగా ఉంటామని, ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని వీరికి తక్షణమే అన్ని వసతులు ఏర్పాటు చేయాలి ఆని తాత్సారం పనికి రాదని తెలియజేశారు.