మదనపల్లిలో అంగన్వాడిల సమ్మెకు జనసేన మద్దతు

మదనపల్లి: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని అంగన్వాడీలను తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, రాష్ట్రంలో అంగన్వాడీల అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, రాజకీయ జోక్యం అరికట్టాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని మార్చాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల,ని బీమా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 టిఏ బిల్లులు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచాలని సంక్షేమ పథకాలు మీరు కూడా అమలు చేయాలని లబ్ధిదారులకు న్యాయమైన ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రీస్కూల్ బలోపేతం చేయాలని డిమాండ్లను ప్రభుత్వం యొక్క డిమాండ్లను అమలు చేసేదాకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంగన్వాడి సెంటర్లను మూసివేసి నిరవదిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె లో వర్కర్లు, హెల్పర్లు మినీ వర్కర్లు పాల్గొన్నారు. మదనపల్లిలో అంగన్వాడీ యూనియన్ లీడర్ ఎం.ఎల్.ఎల్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్ ముందు మధురవాణి ఆధ్వర్యంలో 500 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ చేస్తున్న సమ్మెలో పాల్గొని వరకు సంఘీభావం తెలిపి వారి యొక్క వినతి పత్రాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందజేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సుప్రీమ్ హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, అరవింద్ గని, మంజు, చరణ్, గణేష్, వినయ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.