దాసరి మాలకొండయ్యకు అండగా జనసేన

ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలో దాసరి మాలకొండయ్య అనే దళిత రైతు భూమిని స్థానిక ప్రభావశాలికి చెందిన వ్యక్తి అక్రమంగా ఆక్రమించడంతో ఆయనకు న్యాయం కల్పించేందుకు జనసేన పార్టీ అండగా నిలుస్తోంది. సర్వే నం. 151-2లో మాలకొండయ్యకు పితృస్వామ్యంగా ఉన్న భూమిలో నుంచి సుమారు 8 సెంట్లు కూనం వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్ ద్వారా గట్లు ధ్వంసం చేసి ఆక్రమించాడని బాధితులు ఆరోపించారు. మాలకొండయ్య తన గ్రామంలోని దళితులను వెంటబెట్టుకొని వెంకటరామిరెడ్డిని నిలదీయగా, ఆయన కుల ప్రాతిపదికన దూషిస్తూ అవమానపరిచినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ని బాధిత కుటుంబ సభ్యులు కలిసి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మనోజ్ కుమార్ మాట్లాడుతూ,
“దళితుడి ఆస్తిపై దాడి అంటే అది ఆ సమాజంపై దాడిగా భావిస్తాం. మాలకొండయ్య గారికి న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ న్యాయపోరాటం చేస్తుంది,” అని ధీమాగా ప్రకటించారు. ఈ సందర్భంగా పొన్నలూరు మండల జనసేన నాయకులు పత్తిపాటి మాధవరావు కూడా బాధితుడికి మద్దతుగా నిలిచారు. జనసేన పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడేందుకు, మానవ హక్కులను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని నాయకులు పేర్కొన్నారు.

Share this content:

Post Comment