తాడిపత్రిలో అంగన్వాడీల నిరవధిక దీక్షకు జనసేన మద్దతు

తాడిపత్రిలో అంగన్వాడీల నిరవధిక దీక్షకు జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడతూ ప్రతి పల్లెల్లో అంగన్వాడీల కృషి చాలా గొప్పదని, గతంలో వై. య. స్ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లో తెలంగాణ లో అంగన్వాడీ లకు ఇస్తున్న దానికంటే అధికంగా ఇస్తానని కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు ఇవ్వాల్సినవి కూడా నెలవారీ ఇవ్వకుండా వారి శ్రమకు తూట్లు పొడుస్తున్నారని, మీరు ఇదేవిధంగా ఐక్యత తో పోరాడితే తప్పకుండ ప్రభుత్వం దిగివచ్చి మీ డిమాండ్లను నెరవేరుస్తుందని, ఒకవేళ నేరవేర్చని పక్షంలో రాబోయే జనసేన, టీడీపీ ల ప్రభుత్వంలో కచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి జనసేన ఇంచార్జి శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు శ్రీ కుందుర్తి నరసింహా చారి రసూల్, అయుబ్, శివ, మని, అల్తాఫ్ పాల్గొన్నారు.