పోడూరు మండలం పరిధిలో అంగన్వాడీల దీక్షకు జనసేన మద్దతు

పాలకొల్లు: పోడూరు మండలం పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షకు గురువారం జనసెన పోడూరు మండల అధ్యక్షులు పితాని వెంకటేష్ జనసేన నాయకులు మద్దతు తెలిపారు. వారి పొరాటానికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ మద్దతు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పాల్గొన్నారు. మరియు పోడూరు మండల జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.