SGS కళాశాల విద్యార్థుల నిరసనకు జనసేన మద్దతు

SGS కళాశాల విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనకు మద్దతుగా జనసేన పార్టీ.. SGS కళాశాలని ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలి.

జనసేన పార్టీ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్

కృష్ణా జిల్లా, SGS కళాశాలని ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా ఆ కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసనకు జగ్గయ్యపేట జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు భావితరాల భవిష్యత్ అని అటువంటి వారు కళాశాలలో నాలుగు గోడల మధ్యన ఉండాల్సిన వారు, ఇలా వారి కళాశాలని కాపాడుకోవడం కోసం ఇలా రోడ్ మీదకు రావాల్సిన పరిస్థితి చూసేలా ఉందని తెలిపారు. SGS కళాశాల ఈ ప్రాంతంలో ఎంతో మందికి విద్య పరంగ ఉపయోగపడటమే కాకుండా ప్రతి కుటుంబంలో విద్యార్థులు ఉన్నత విద్యని అభ్యసించారని, అటువంటి కళాశాలని ఈరోజు ప్రైవేటికరణ చేస్తున్నారనే నిర్ణయం సరైనది కాదని విద్యార్థుల తరుపున జనసేన పార్టీ ద్వారా కళాశాల యాజమాన్యాన్నీ కోరుతున్నామని ఆయన తెలిపారు. జగ్గయ్యపేట ప్రాంత పరిధిలో ప్రభుత్వ కళాశాలలు లేక పేద, బడుగు వర్గాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని కళాశాల యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని, ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాజి, హేమంత్, పవన్, అజయ్, రాజు, సుమంత్, తరుణ్, రాం, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.