టీడీపీ నిరసన దీక్షకు జనసేన మద్దతు

ఎస్.కోట నియోజకవర్గం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా శుక్రవారం ఎస్.కోట దారగంగమ్మ కళ్యాణ మండపము వద్ద టీడీపీ నియోజక ఇంఛార్జి కోళ్ల లలితకుమారి అధ్వర్యంలో 3వ రోజు రిలే నిరహరదీక్ష శిబిరం వద్దకు జనసేన పార్టీ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, పెడిరెడ్ల రాజ శేఖర్ మద్దతుగా పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గందవరపు సతీష్ గణేష్ కాశీ పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.