గౌఛర్ వ్యాధి బారినపడిన చిన్నారికి జనసేన అండ

పార్వతీపురం, సీతానగరం మండలం, చిన్న బోగిలి గ్రామంలో గౌఛర్ వ్యాధి బారినపడిన చిన్నారిని పరామర్శించడానికి వెళ్లిన జనసేన నాయకులకు ఆ గ్రామంలో జనసైనికులు ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ సకల మర్యాదలు ఇచ్చి గౌరవించడం జరిగింది. చిన్నారి రమణకు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసి విరాళాలు ఇచ్చి ఆ కుటుంబానికి ఎంతో కోంత సపోర్ట్ గా నిలిచిన విధానం చూసి గ్రామంలో దూర్గా దేవి నవరాత్రుల కార్యక్రమం అపేసి మరీ వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం జరిగింది. వారి వంతుగా నగదు 7000/- రూపాయలు సహాయం చేయడం జరిగింది. కర్రొతు అప్పన్న మామయ్య 5000/- బాబుకు ఇమ్మని ఫోన్ పే చేయగా చందక అనిల్ 2000/- నగదు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.