గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల నిరవధిక నిరాహార దీక్షకు జనసేన మద్దతు

గాజువాక, గంగవరం పోర్టు నిర్వాసిత ఉద్యోగుల నిరవధిక నిరాహార దీక్షకు వారి ఆహ్వానం మేరకు వెళ్లి మద్దతు తెలియజేయడం జరిగింది. మీకు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మన చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు బాధ్యతను విస్మరించి ప్యాకేజీల కోసం వెంపర్లడాతున్నారు. మన ప్రాంతంలోనే ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఈ ప్రాంతం ప్రజలు భూములు ఇచ్చి 26 రోజులుగా ఈ విధంగా తమ హక్కుల కోసం పోరాడే దుర్భర పరిస్థితి ఏర్పడినందుకు వీళ్ళని గెలిపించిన మన ప్రాంత ప్రజలందరూ కూడా సిగ్గుపడాల్సిన దుస్థితి. త్వరలో వీళ్ళకి సరైన బుద్ధి ఈ ప్రజలే చెప్తారని ఆకాంక్షిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరణం కళావతి, రౌతు గోవిందరావు, సోమశేఖర్, కాదా శ్రీను, సంద్రాన్ భాస్కర్, గుంటూరు నరసింహమూర్తి, మొలకలపల్లి వంశీ, సనపాల డిల్లేశ్వరరావు, జగన్నాథ రమణ, వసంత, పితాని భాస్కర్, దొరబాబు, నాగేంద్ర, గోపి పాల్గొని మద్దతు తెలియజేశారు.