మదనపల్లెలో మున్సిపల్ కార్మికుల సమ్మెకి జనసేన మద్దతు

మదనపల్లె: ఏపీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ యూనియన్ తరఫున రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్ ఆధ్వర్యంలో నగర పంచాయతీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ మరియు పెర్మనెంట్ పారిశుద్ధ ఇంజనీరింగ్ విభాగాల్లో స్కూల్ స్లీపర్ల, డ్రైవర్ల, పార్క్ వర్కర్ల, సమస్యల పరిష్కారానికి పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 ప్రకారం సంక్రమించబడిన హక్కు మేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ స్వతంత్ర కార్మికుల సంఘాలు కలిసి మునిసిప ల్ కార్మిక సంఘాల జాయింట్ కమిటీగా ఏర్పడి.. బుధవారం మదనపల్లి నియోజకవర్గం స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ ముందర చేపట్టిన సమ్మెకి మద్దతు తెలిపి, వీరు న్యాయబద్ధమైన 17 డిమాండ్లను తక్షణమే ప్రభుత్వము అమలు చేయాలని చేస్తున్న సమ్మెకు. మదనపల్లి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరి ప్రసాద్, మదనపల్లి స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు సుప్రీం హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను జనసేన నాయకులు అశ్వత్ మైనారిటీ నాయకులు గణేష్, మదనపల్లి జనసేన మహిళా నాయకురాలు రూప బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు, అనిత మాట్లాడుతూ మదనపల్లెలో 1992 ప్రకారం ఉన్న కార్మికులు సంఖ్యనే(250) సాగి స్తున్నారని, పెరిగిన జనాభా పరంగా కార్మికుల సంఖ్య ను పెంచకపోగా170మందికి తగ్గించారని వీళ్ళకి పని భారం ఎక్కువ ఉండటం తగిన వేతనం లేకపోవడం కేవలం 21 వేలు మాత్రమే ఇవ్వడం ఇందులో కూడా 2000 కటింగ్ పోను చాలి చాలని జీతంతో బతకడం దుర్బరంగా వుంది. కావున పారిశుధ్య కార్మికుల యొక్క డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిశీలించి, వాటిని అమలు చేసి వారికి తగు న్యాయం చేయాలని అట్ల చేయని పక్షంలో ఈ యొక్క అంశాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టి వరకు తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా జనసేన పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.