జిల్లాల విభజన బాధ్యత జనసేన తీసుకుంటుంది: డా. యుగంధర్ పొన్న

*స్వామి పదవీ అలంకరణకే మరియు కుటుంబ అభివృద్ధి కే

*ఏనాడూ ప్రజా సమస్యలపై శ్రద్ద లేదు, ప్రజలకు చేసిందేమి లేదు

*ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లా విభజన, ఆ బాధ్యత జనసేన తీసుకుంటుంది

వెదురుకుప్పం మండలంలో జిల్లా విభజన వ్యతిరేకతగా జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ.. స్వామికి పదవి అలంకరణ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, కుటుంబాబీ వృద్ధి, సంపాదనే ద్యేయంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వలేదు. పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారు. లోపభూయిష్టంగా ఈ విభజన జరిగింది. ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వారు ఎదుర్కొనే దూరా భారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదు? ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం చేయకపోవడం చాలా బాధాకరం అని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల లో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదు. డ్రాఫ్ట్ ఇచ్చేముందు చర్చలు జరగలేదు. ప్రజలు ఇచ్చిన వినతులు కనీసం పరిగణించలేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో లోపాలు అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుంది. తదుపరి వీటిని చక్కదిద్ది ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతను జనసేన తీసుకుంటుంది. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలి. ఎస్ ఆర్ పురం, పాలసముద్రం మండలాలను చిత్తూరు రెవిన్యూ డివిజన్ లో కలపాలి. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి రెవెన్యూ డివిజన్ లో కలపాలి. గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి ఏ ప్రాధాన్యత లేకపోగా కనీసం కార్వేటినగరం మండలం లో డి.ఎస్.పి ఆఫీసును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీటి సాధన కోసం దీక్ష చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శిలు వెంకటేష్, రాఘవ, తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి, చాణిక్య, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యతిశ్వర్ రెడ్డి, మండల కార్యదర్శి వేణు, మండల ప్రధాన కార్యదర్శి మోహన్, బహుజన కులాల ఐక్యవేదిక మండల అధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు.