ఇచ్చాపురంలో జనసేన-టిడిపి-బిజెపి ప్రచారం

ఇచ్చాపురం, కంచిలి మండలం (జె.శాసనం, బి.శాసనం) గ్రామంలో సూపర్ సిక్స్ ప్రోగ్రాం (బాబు షూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ) కార్యక్రమంలో ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు పాల్గొని అనంతరం ఇచ్చాపురం మున్సిపాలిటీ 7వ వార్డ్ ఉప్పల వీధి, కొండి వీధి, పప్పల వీధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు దాసరి రాజు మరియు జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి పాల్గొని సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ జనసేన-టిడిపి-బిజెపి, కూటమి అభ్యర్థి అయినటువంటి బెందాళం అశోక్ బాబుని, ఎమ్మెల్యేగా, కింజరాపు రామ్మోనాయుడుని ఎంపిగా సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ మూడోసారి గెలిపించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచిలి మండలం అధ్యక్షులు డొక్కరి ఈశ్వరరావు, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఇన్చార్జులు రోకళ్ల భాస్కరరావు, కాళియ గౌడో, మరియు జనసేన నాయకులు రుక్మాంధర్, చంటి, ఎర్రయ్య, వల్లభ, మీనారావు, నీలవేణి, హేమంత్, కర్రీ నాగరాజు, రాజు, లోకేష్, రఘు, నవీన్, వంశీ, కోగేష్ మరియు జనసేన-టిడిపి-బిజెపి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.