కొంగోడు గ్రామంలో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రచారం

కాకినాడ రూరల్, కరప మండలం, కొంగోడు గ్రామంలో బీసీ పేటలో జనసేన-టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ,
టీడీపీ కాకినాడ రూరల్ కో-ఆర్డినేటర్ మాజీ శాసనభ్యులు శ్రీమతి & శ్రీ పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు మరియు టీడీపీ కో- కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ రాబోయే ఎన్నికల్లో మీ పవిత్ర మైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుఫై వేసి అఖండ మెజారిటితో గెలిపించాలని, అదేవిధంగా ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, ప్రచారం నిర్వహించారు. రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వనుము నారాయణరావు, ఆట్ల గోవింద్ రాజులు, బుంగ సింహాద్రి, జనసేన నాయకులు, నక్క గోవింద్, కోన వీరబద్ర రావు, బండారు మురళి, బోగిరెడ్డి కొండబాబు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.