జనసేన – టీడీపీ ఉమ్మడి సమావేశ సమన్వయ కార్యాచరణ

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన – టీడీపీ ఉమ్మడిగా జరిగే సమావేశంను సమన్వయం చేసుకునే కార్యాచరణ గురించి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డితో నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. జనసేన పార్టీ కార్యాలయంకు విచ్చేసిన టీడీపీ ఇంఛార్జి సుధీర్ రెడ్డిని నాయకులు, జనసైనికులతో కలిసి దుస్యాలువతో సత్కరించడం జరిగింది.